Khammam: Mother Killed Daughter Due To Extra Marital Affair With Her Husband Father - Sakshi
Sakshi News home page

Khammam Crime: చూడకూడనిది చూసిందని.. కన్నకూతురినే..

Feb 16 2022 2:54 AM | Updated on Feb 16 2022 8:49 AM

Mother And Grandfather They Diseased The Girl In Khammam District - Sakshi

మహాదేవి 

బోనకల్‌: ఓ మహిళ తన భర్త తండ్రితో శారీరక సంబంధం ఏర్పర్చుకున్న విషయాన్ని బయటపెడుతుందేమోనని కన్నకూతురినే కడతేర్చింది. తన కూతురు ఫిట్స్‌తో స్కూల్లో మృతిచెందినట్లు అందరినీ నమ్మించింది. చివరికి పోలీసుల విచారణలో నేరం అంగీకరిం చింది. ఖమ్మం జిల్లా బోనకల్‌లో జరిగిన ఈ ఘటన వివరాలను వైరా ఏసీపీ స్నేహామెహ్రా మంగళవారం ఇక్కడ వెల్లడించారు. బోన కల్‌కు చెందిన పా లెపు హరికృష్ణ– సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.

హరికృష్ణ లారీ, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన తరచూ పని నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్తుండేవాడు. ఈ క్రమం లో సునీతకు తన భర్త తండ్రి నర్సింహారావుతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఐదారేళ్లుగా ఇది కొనసాగుతున్నా ఇటీవల తల్లి– తాత ఒకే గదిలో ఉండగా సునీత పెద్ద కుమార్తె మహాదేవి(11) గమనించింది. ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని మహాదేవి అనడంతో బెదిరిపోయిన సునీత, నర్సింహారావులు ఆ మెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. 

ఫిట్స్‌తో మృతి చెందినట్లు చిత్రీకరణ
ఈ నెల 8న మహాదేవి కాళ్లు, చేతులను చున్నీతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వైరుతో మెడ బిగించి హతమార్చారు. తన కూతురు ఫిట్స్‌తో స్కూల్లో మృతి చెందినట్లు సునీత అందరినీ నమ్మించింది. అయితే, పాపమెడపై ఉన్న కమిలిన గాయాలను బంధువులు గమనించి పోలీసులకు చెప్పడంతో వారు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు.

మహాదేవి హత్యకు గురైనట్లు నివేదిక రావడంతో పోలీసులు బాలిక తల్లి, తాతను అదుపులోకి తీసుకుని విచారించారు. మహాదేవిని తామే హత్య చేసినట్లు సునీత, నర్సింహారావు అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, కేసును త్వరగా ఛేదించిన మధిర సీఐ మురళి, ఎస్‌ఐ కవిత, సిబ్బంది నాగేశ్వరరావు, సత్యంబాబు, శాంత్‌కుమార్‌ను ఏసీపీ అభినందించి క్యాష్‌ రివార్డు అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement