Hyderabad: కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం | Molestation on Woman in Running Bus at Bhagyanagar Colony Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం

Feb 27 2022 8:08 AM | Updated on Feb 27 2022 8:30 AM

Molestation on Woman in Running Bus at Bhagyanagar Colony Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: కదులుతున్న బస్సులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన ఓ మహిళ (29) మాదాపూర్‌ సమీపంలోని పర్వత్‌నగర్‌లో నివాసముంటూ బేబే కేర్‌ సెంటర్‌లో పనిచేస్తోంది. ఈ నెల 23న ఆమె రైలులో తన స్వగ్రామం వెళ్లేందుకు రిజర్వేషన్‌ చేసుకుంది.

లగేజి ఉండటంతో మెట్రో సమీపంలో వి. కావేరి ట్రావెల్స్‌ బస్సులో లగేజీని అప్పగించి తీసుకురావాలని సూచించింది. అయితే బస్సు డ్రైవర్‌ రాజేష్‌ (35) లగేజీని బస్సులో ఉంచి మీరు ఎలా వెళ్తారని ప్రశ్నించగా తాను రైలులో వస్తానని చెప్పింది. దీంతో డ్రైవర్‌ బస్సులోనే రావాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఆమె అదే బస్సు ఎక్కింది. టిక్కెట్టు రూ. 700 బస్సు చార్జీ, లగేజీ చార్జి కింద వసూలు చేశాడు. అనంతరం ఆమె వెనుక బెర్త్‌ సీటు ఇచ్చాడు.

చదవండి: (గంజాయి మత్తులో ‘సాఫ్ట్‌వేర్లు’)

మార్గమధ్యలో ఆమె దగ్గరకు వచ్చిన రాజేష్‌ మరో డ్రైవర్‌ బస్సు  నడుపుతున్నాడని తాను ఇక్కడ కూర్చుంటానని ఆమెతో చెప్పాడు. దీంతో ఆమె అంగీకరించటంతో వెంటనే తన వద్ద ఉన్న కత్తిని మెడపై పెట్టి అత్యాచారానికి పాల్పడినట్లు నిందితురాలు పేర్కొంది. అదే రోజు ఏలూరు రోడ్డులో దిగిన ఆమె తిరిగి హైదరాబాద్‌ చేరుకొని కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాజేష్‌ని అదుపులోకి తీసుకొన్నారు. విచారణ చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement