
సాక్షి, మేడ్చల్: గుర్తుతెలియని వ్యక్తులు నాలుగేళ్ల చిన్నారిని అపహరించి 16 గంటల తరువాత చెట్ల పొదల్లో వదలివేశారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలికను పోలీసులు నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. జవహర్‌నగర్ సీఐ బిక్షపతిరావు తెలిపిన మేరకు.. దమ్మాయిగూడ వెంకటేశ్వరకాలనీకి చెందిన బాలిక ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి కిరాణ దుకాణానికి వెళుతుండగా గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు.
ఆందోళన చెందిన తల్లిదండ్రులు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలిస్తున్న క్రమంలో సోమవారం ఉదయం బాలిక ప్రగతినగర్ వాటర్‌ట్యాంక్ వద్ద అపస్మారకస్థితిలో కనిపించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని బాలికను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బాలికపై లైంగిక దాడి చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల ఆదుపులో అనుమానితులు...
సోమవారం 4 గంటలకు దమ్మాయిగూడలో కిడ్నాప్‌కు గురైన చిన్నారిని ఆదివారం ఉదయం దాదాపు 9 గంటలకు పొదల్లో చిన్నారిని వదిలిపెట్టారు. దాదాపు 16 గంటల పాటు చిన్నారిని ఎక్కడ ఉంచారు అనేది తేలాల్సి ఉంది. బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు దుండగులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.