
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో పెళ్లింట భారీ చోరి జరిగింది. సుమారు 200 తులాల బంగారం, రూ. 7లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. కూతురు పెళ్లి కోసం తీసుకొచ్చిన ఆభరణాలతో పాటు, నగదును ఎత్తుకెళ్లారు. అయితే దొంగతనం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే నిద్రిస్తున్నారు. తెల్లవారుజామును లేచి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించారు. దీంతో వెంటనే వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. చదవండి: (చెట్టంత కొడుకులు.. శవాలై తేలితే..)