Married Woman Commits Suicide In Anantapur, Details Inside - Sakshi
Sakshi News home page

మేనమామతో పెళ్లి.. భర్త తీరు బాగోలేదంటూ వివాహిత షాకింగ్‌ ట్విస్ట్‌

Jan 6 2023 3:03 PM | Updated on Jan 6 2023 4:40 PM

Married Woman Suicide In Anantapur - Sakshi

శ్రావణి (ఫైల్‌)

అయితే దుర్గాప్రసాద్‌ తీరు సరిగా లేదంటూ పలుమార్లు తన తల్లిదండ్రులకు శ్రావణి చెబుతూ వచ్చింది.

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని ఐదో రోడ్డులో నివాసముంటున్న శ్రావణి (26)ని అదే రోడ్డులో ఉంటున్న మేనమామ దుర్గాప్రసాద్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల వయసున్న కుమార్తె ఉంది. దంపతులిద్దరి మధ్య అప్పుడప్పుడు మనస్పర్థలు తలెత్తి గొడవపడేవారు. ఇద్దరికీ కుటుంబ పెద్దలు సర్దిచెప్పేవారు.

అయితే దుర్గాప్రసాద్‌ తీరు సరిగా లేదంటూ పలుమార్లు తన తల్లిదండ్రులకు శ్రావణి చెబుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం ఇద్దరూ గొడవపడ్డారు. అనంతరం శ్రావణి గదిలోకి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు.

దీంతో అనుమానం వచ్చి గది తలుపు తీసి చూస్తే ఫ్యాన్‌కు వేసుకున్న ఉరికి వేలాడుతున్న శ్రావణి మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి అక్కమ్మ, సోదరుడు రాధాకృష్ణ అక్కడకు చేరుకుని శ్రావణి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అక్కమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
చదవండి: స్వప్పతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..    

Advertisement
 
Advertisement
Advertisement