కుమారుడి మృతి తట్టుకోలేక.. | Sakshi
Sakshi News home page

కుమారుడి మృతి తట్టుకోలేక..

Published Thu, May 23 2024 12:05 PM

married woman attempted suicide in srikakulam

తల్లి ఆత్మహత్యాయత్నం 

టెక్కలి రూరల్‌: మండలంలోని రావివలస పంచాయతీ చిన్న నారాయణపురం గ్రామానికి చెందిన దాసరి నిరోష అనే వివాహిత బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈమె కుమారుడు సాయివినీత్‌ మంగళవారం పాముకాటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. 

తన కుమారుడు కళ్లెదుటే కాలి బూడిదవ్వడంతో  చూసి తట్టుకోలేకపోయిన ఆ తల్లి ఇక తానెందుకు బతకాలి అంటూ కుమిలిపోయి ఇంట్లో ఉన్న మాత్రలను అధిక మొత్తంలో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే టెక్కలి జిల్లాసుపత్రికి తరలించారు. చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement