breaking news
Married woman attempt suicide
-
కుమారుడి మృతి తట్టుకోలేక..
టెక్కలి రూరల్: మండలంలోని రావివలస పంచాయతీ చిన్న నారాయణపురం గ్రామానికి చెందిన దాసరి నిరోష అనే వివాహిత బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈమె కుమారుడు సాయివినీత్ మంగళవారం పాముకాటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. తన కుమారుడు కళ్లెదుటే కాలి బూడిదవ్వడంతో చూసి తట్టుకోలేకపోయిన ఆ తల్లి ఇక తానెందుకు బతకాలి అంటూ కుమిలిపోయి ఇంట్లో ఉన్న మాత్రలను అధిక మొత్తంలో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే టెక్కలి జిల్లాసుపత్రికి తరలించారు. చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. -
రైలుకు ఎదురెళ్లి వివాహిత ఆత్మహత్యాయత్నం..
నెల్లూరు , నాయుడుపేటటౌన్: భర్తతోపాటు అత్త వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి చెందిన ఓ వివాహిత తన చంటిపాపతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యాయత్నానికి పూనుకుంది. ఇద్దరు వ్యక్తులు గుర్తించి పరుగున వెళ్లి వారిద్దరిని కాపాడిన ఘటన పట్టణ పరిధిలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసుల కథనం మేరకు.. పోతమ్మ అనే మహిళకు అగ్రహారపేటకు చెందిన పసల మదన్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి జాషువ అనే కుమారుడు, మధుప్రియ అనే నెలల చంటిపాప ఉన్నారు. మదన్‌కుమార్ కొంతకాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని పోతమ్మను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో రెండురోజుల క్రితం ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై జి.వేణు మదన్‌కుమార్‌ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మందలించి పంపించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అత్త పోతమ్మను పరుష పదజాలంతో దూషించింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మనస్తాపానికి గురైన పోతమ్మ సోమవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి చంటిబిడ్డను తీసుకుని బయటకు వచ్చేసింది. రైలుకి ఎదురెళుతుండగా.. పోతమ్మ బిడ్డతో కలిసి తనువు చాలించేందుకు పట్టణ సమీపంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ రైలుపట్టాల వద్దకు వెళ్లింది. చెన్నై వైపు నుంచి రైలు వస్తుండడంతో దానికి ఎదురుగా చంటిబిడ్డతోపాటు వెళుతుండగా కాలనీకి చెందిన కప్పల మునుస్వామి, నాగరాజులు గుర్తించారు. వారు వెంటనే వెళ్లి రైలుపట్టాల మధ్యలో ఉన్న ఆమెను పక్కకు లాగారు. కాలనీ మహిళలు ఆమెకు అక్కున చేర్చుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి వెళితే అత్తమామలు తిరిగి వేధిస్తారని, తనను వదిలిపెట్టాలని పోతమ్మ చెప్పడంతో మహిళలు ఆమెకు ధైర్యం చెప్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివాహితను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్సై వేణు మదన్‌కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించినా రాత్రి వరకు కూడా రాలేదు. దీంతో ఆమెను మూలపడవలోని తల్లిదండ్రుల వద్దకు పంపారు. బాధితురాలికి న్యాయం చేసేలా చర్యలు చేపడతామని ఎస్సై తెలిపారు. తల్లీబిడ్డను కాపాడిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు అభినందించారు. -
వివాహిత ఆత్మహత్యా యత్నం
వంగర : ఎం.సీతారాంపురం గ్రామానికి చెందిన వివాహిత జాడ రమణమ్మ పురుగులు మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నాలుగేళ్ల కిందట కొమరాడ మండల కేంద్రానికి చెందిన జాడ నందీశ్వరరావుతో వివాహం జరిగింది. అప్పటి నుంచి భర్తతో పాటు అత్తింటి వేధింపులు అధికమయ్యాయని అపస్మారక స్థితిలో ఉన్న రమణమ్మ పోలీసులకు వివరించినట్లు తల్లి అల్లక సరోజినమ్మ, సోదరుడు అల్లక శ్రీను విలేకరులకు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన మాకు అత్తింటి వారు అదనపు కట్నం తెమ్మంటున్నారని, లేకపోతే అత్తింటికి భర్త తీసుకువెళ్లమని చెబుతున్నారని, తమకు న్యాయం చేయాలని చావుబతుకుల్లో ఉన్న రమణమ్మ, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు వంగర పోలీసులు రాజాం సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న రమణమ్మ వద్ద నుంచి వాంగ్మూలం స్వీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వై.మధుసూదనరావు తెలిపారు.