ఇన్‌ఫార్మర్‌ నెపంతో యువకుడి హత్య

Maoists Assassinated Tribal Man On The Suspicion Of Police Informer In Orissa - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఓ గిరిజన యువకుడిని హత్య చేశారు మావోయిస్టులు. ఈ సంఘటన ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల్లోని మల్కాన్‌గిరి జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్కాన్​గిరి జిల్లా కట్ ఆఫ్ ఏరియాలో గల జోడం పంచాయతీ ఖజిరిపుట్ గ్రామానికి చెందిన దాస్ కీముడు అనే 25 ఏళ్ల యువకుడు ఇన్‌ఫార్మర్‌గా ఉంటూ తమ విషయాలను పోలీసులకు చేరవేస్తున్నాడని మావోయిస్టులు భావించారు. ( 60 గంటలు దాటినా దొరకని దీక్షిత్‌ ఆచూకీ )

ఇటీవల భద్రతా బలగాలు లక్ష్యంగా పాతి పెట్టిన 7 మందు పాతరల గురించి పోలీసులకు తెలియటం అతడి పనేనని వారు భావించారు. దీంతో అతడ్ని దారుణంగా హత్య చేశారు. అతడితో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా గాయపరిచారు. ఈ ఘటనతో కట్ ఆఫ్ ఏరియాలోని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top