బీఎస్పీ సీటు దక్కలేదన్న మనస్తాపంతో..

Man Takes Life Due To Not Getting BSP Seat For 2022 Assembly Election - Sakshi

లక్నో : బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీ(బీఎస్పీ) సీటు దక్క లేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాపూర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాపూర్‌కు చెందిన మున్ను ప్రసాద్‌ అనే వర్తకుడు గత కొన్ని సంవత్సరాలుగా బీఎస్పీలో పని చేస్తున్నాడు. 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే పార్టీ అధ్యక్షురాలు మాయావతి అతడి వద్దనుంచి 2 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసిందని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ( ఉగ్ర ఘాతుకం: బీజేపీ నేతల కాల్చివేత )

ఆమె అడిగిన మొత్తం ఇవ్వలేని స్థితిలో ఉన్న తనకు ఆత్మహత్యే శరణ్యమని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. దీనిపై బీఎస్పీ కోఆర్డినేటర్‌ గుడ్డు రామ్‌ మాట్లాడుతూ.. మున్ను ప్రసాద్‌కు పార్టీతో సంబంధం లేదని, సూసైడ్‌ నోట్‌ పార్టీ పేరును దిగజార్చేలా ఉందని అన్నారు. అయితే మున్ను బీఎస్పీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని, తనకు మాయావతి కచ్చితంగా సీటు ఇస్తుందనే వాడని స్థానికులు చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top