పెళ్లయిన నాటి నుంచి చిత్ర హింసలు.. భార్య పుట్టింటి నుంచి రాను అనడంతో..

Man Stabbed Wife, Mother In Law And One Other In Raichur, Karnataka - Sakshi

సాక్షి, రాయచూరు : కర్ణాటకలోని రాయచూరులో దారుణం చోటు చేసుకుంది. అల్లుడి చేతిలో తల్లీ కూతుళ్లు హత్యకు గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి తాలూకాలోని యరమరాస్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. యరమరాస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద నివాసం ఉంటున్న పారిశుధ్య కార్మికురాలు సంతోష్‌​ (45)కి వైష్ణవి(25), ఆరతి(16) కూతుళ్లు.

ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాయి అనే యువకుడితో పెద్దకూతురు వైష్ణవికి వివాహం జరిపించారు. సాయి హైదరాబాద్‌లో వడ్డీ వ్యాపారి. పెళ్లయినప్పటి నుంచి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. దీంతో ఇటీవల వైష్ణవి పుట్టింటికి వచ్చింది. మంగళవారం రాత్రి సాయి అత్తవారింటికి వచ్చాడు. తనతో హైదరాబాద్‌కు రావాలని భార్యను ఒత్తిడి చేయడంతో ఆమె ససేమిరా అంది. 
చదవండి: అంతర్రాష్ట్ర క్రికెట్‌ బెట్టింగ్‌ రాకెట్‌ బ్లాస్ట్‌: రూ.2.21 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం 

ఈ క్రమంలో ఉన్మాదిగా మారిన సాయి భార్యను, అడ్డు వచ్చిన అత్త సంతోషిని, మరదలు ఆరతిని కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో బాధితులు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచారు. అర్ధరాత్రి సమయం కావడంతో అందరూ నిద్రలో ఉన్నందున ఘటన గురించి ఎవరికీ తెలియలేదు. బుధవారం ఉదయం సంతోషి బంధువులు పనిమీద ఇంటికి రాగా రక్తపు మడుగులో ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. అక్కడికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్పీ శ్రీహరి బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. రాయచూరు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి హంతకుడి కోసం గాలింపు చేపట్టారు. అతడి కోసం హైదరాబాద్‌కు పోలీసు 
బృందాలు వచ్చాయి. 
చదవండి: మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని మరదలుకు చెప్పి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top