వివాహేతర సంబంధం: ప్రియురాలికి నిప్పంటించి.. | Man Set Woman On Fire Deceased Over Extra Marital Affair Tamil Nadu | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: ప్రియురాలికి నిప్పంటించి..

Apr 12 2021 2:28 PM | Updated on Apr 12 2021 4:07 PM

Man Set Woman On Fire Deceased Over Extra Marital Affair Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

టీ.నగర్‌: కోయంబేడు బస్టాండులో శుక్రవారం రాత్రి మహిళ సజీవ దహనానికి గురైంది. మంటల్లో కాలి ఆమె ప్రియుడు కూడా మృతిచెందాడు. శాంతి కోయంబేడు బస్టాండ్‌లో బసచేసి పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమెకు మార్కెట్‌లో కూలీ ముత్తుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. శుక్రవారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో నాలుగో ప్లాట్‌ ఫాంపై శాంతి నిద్రించింది.

ఆ సమయంలో పెట్రోలు క్యాన్‌తో వచ్చిన ముత్తు ఆమె పక్కన పడుకున్నాడు. తర్వాత ఆమెపై హఠాత్తుగా పెట్రోలు కుమ్మరించి నిప్పంటించాడు.  శాంతి పరుగులు తీయకుండా పట్టుకున్నాడు. వీరి కేకలు విని అక్కడికి వెళ్లి చూడగా ఇరువురూ మంటల్లో కాలిపోసాగారు. గాయపడ్డ వారిని కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఇద్దరూ మృతిచెందారు. కాగా ముత్తు సదరు మహిళపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడానికి గల కారణాలు తెలియరాలేదు.

చదవండి: అవ్వ ఇంటికి వచ్చి అంతమయ్యాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement