అవ్వ ఇంటికి వచ్చి అంతమయ్యాడు | Rowdy Sheeter Assassinated In Karnataka Over Old Dispute | Sakshi
Sakshi News home page

అవ్వ ఇంటికి వచ్చి అంతమయ్యాడు

Apr 12 2021 2:05 PM | Updated on Apr 12 2021 2:16 PM

Rowdy Sheeter Assassinated In Karnataka Over Old Dispute - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటి బయట ఉండగా నలుగురు దుండగులు మారణాయుధాలతో దాడి చేయడంతో సునీల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

సాక్షి, బెంగళూరు/బనశంకరి: రౌడీషీటర్‌ హత్యకు గురైన ఘటన బ్యాటరాయనపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. కస్తూరినగరకు చెందిన రౌడీషీటర్‌ సునీల్‌(38) గతంలో సోమన్‌ అనే రౌడీషీటర్‌ హత్యకేసులో జైలుకు వెళ్లాడు. జామీనుపై విడుదలై కొంతకాలంగా కుంబళగోడులో ఉన్న అక్క ఇంట్లో ఉండేవాడు. ఉగాది పండుగ నేపథ్యంలో శనివారం రాత్రి కస్తూరినగరలోని అవ్వ ఇంటికి  వచ్చాడు.

రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటి బయట ఉండగా నలుగురు దుండగులు మారణాయుధాలతో దాడి చేయడంతో సునీల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి నిందితుల కోసం గాలింపు  చేపట్టారు.  సోమన్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి అతడి అనుచరులే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

చదవండి: యువ బాడీబిల్డర్‌ దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement