అన్న కాదు మృగాడు.. గర్భం దాల్చిన బాలిక   | Man Held For Assaulting Sister In Karnataka | Sakshi
Sakshi News home page

అన్న కాదు మృగాడు.. గర్భం దాల్చిన బాలిక  

Published Mon, Nov 29 2021 6:36 AM | Last Updated on Mon, Nov 29 2021 7:10 AM

Man Held For Assaulting Sister In Karnataka - Sakshi

మైసూరు(కర్ణాటక): తోడబుట్టిన చెల్లిపై అన్న అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణంతో ఆమె గర్భం దాల్చిన సంఘటన మైసూరు గిరిదర్శిని నగరలో వెలుగుచూసింది. కామాంధుడు వినయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చిన్న వయసులోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో 16 ఏళ్ల బాలిక అన్న వినయ్‌కుమార్‌ వద్ద ఉంటోంది. ఆమెకు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు ఉండగా, అక్కలకు పెళ్లయి వెళ్లిపోయారు. మద్యానికి బానిస అయిన వినయ్‌కుమార్‌ మద్యం తాగి వచ్చి చెల్లిపై లైంగికదాడికి పాల్పడేవాడు. గత మూడు నెలలుగా ఇలా జరుగుతుండటంతో ప్రస్తుతం బాలిక గర్భవతి అయ్యింది. ఇది తెలిసిన మరో అన్న ఆళనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని మృగాన్ని అరెస్టు చేశారు. బాలికను ఆస్పత్రిలో చేర్పించారు.

చదవండి: సినిమా చూసి.. శవాన్ని ముక్కలుచేసి..   

బాలికకు గర్భం, యువకుడు అరెస్టు  
శివమొగ్గ: మైనర్‌ బాలికను పెళ్ళి కూడా చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన కేసులో యువకున్ని అరెస్టు చేశారు. భద్రావతిలోని న్యూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం బాలికకు అనారోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి బాలిక కడుపుతో ఉందని చెప్పారు. తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విషయం బయట పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యువకున్ని అరెస్టు చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement