
నాగర్‌కర్నూల్: భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ పట్టణంలోని రాంనగర్‌కాలనీకి చెందిన రాజవర్ధన్‌రెడ్డి (30) ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు రెండేళ్లక్రితం వివాహం కాగా కుటుంబ కలహాలతో ఆరు నెలల కిత్రం భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమె తిరిగి కాపురానికి రాకపోవడంతో భర్త మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఇంట్లోని పైగదిలో ఉరేసుకుని చనిపోయాడు. కొద్దిసేపటికి తల్లి పద్మమ్మ గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని ఏఎస్‌ఐ చంద్రయ్య పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి లోని మార్చురీకి తరలించారు.