మహిళతో వెటర్నరీ అటెండర్‌ సన్నిహిత సంబంధం.. చివరికి ట్విస్ట్‌ | Sakshi
Sakshi News home page

మహిళతో వెటర్నరీ అటెండర్‌ సన్నిహిత సంబంధం.. చివరికి ట్విస్ట్‌

Published Sat, Aug 13 2022 11:12 AM

Man Commits Suicide At Friend House In Nellore - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): స్నేహితురాలి ఇంట్లో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మండలం అంబవరానికి చెందిన శ్రీనివాసులు (40) వెటర్నరీ ఆస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. అదే మండలానికి చెందిన ఓ మహిళ కొంతకాలంగా శెట్టిగుంటరోడ్డులోని వైటీనాయుడి వీధి సమీపంలో ఒంటరిగా నివాసం ఉంటున్నారు.
చదవండి: సివిల్స్‌ కోచింగ్‌ కోసం వచ్చి.. జల్సాల మత్తులో ‘లక్ష్యం చెదిరింది’

ఆమెతో శ్రీనివాసులు సన్నిహితంగా ఉంటూ ఇటీవల ఇంటికొచ్చారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమై సదరు మహిళను పోలీసులు విచారించగా.. తాను పనిపై బయటకెళ్లిన సమయంలో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దీంతో పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకీ తరలించారు. కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.  సదరు మహిళను పోలీసులు విచారిస్తున్నారు.

    

Advertisement
 
Advertisement
 
Advertisement