నాభార్యను చంపేశా అంటూ కాల్‌!..కంగుతిన్న పోలీసులు

Man Called Police Informed Murdered My Wife In Delhi - Sakshi

ఇంత వరకు మనం క్షణికావేశంలో హతమార్చడం లేదా తప్పుడూ నిర్ణయాలు తీసుకుని చనిపోవడం విని ఉంటాం. ఒక వేళ హత్య చేసిన ఆ తర్వాత భయంతో పోలీసులకు లొంగిపోవడం వంటివి కూడా చూశాం. కానీ నేనే చంపేశా రండి అరెస్టు చేయండి అంటూ పోలీసులకే ఫోన్‌ కాల్‌ చేయడం గురించి ఇంత వరకు విని ఉండ లేదు కదా. ఇక్కడొక వ్యక్తి డైరెక్టగా పోలీసులకే అసలు విషయం చెప్పి ఇంటికి రమ్మని పిలవడంతో.. ఒక్కసారిగా ఇది నిజమా? కాదా! అన్నంతగా షాక్‌ అయ్యారు పోలీసులు. 

వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి పోలీసులకు ఉదయం ఎనిమిది గంటలకు ఫోన్‌ చేసి నా భార్యను చంపేశానంటూ పోలీసులకు కాల్‌ చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..యోగేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి సుశీల్‌ గార్డెన్‌లో ఉన్న తన ఇంట్లోనే తన భార్యను హత్య చేశానని పోలీసులకు కాల్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్‌ అయ్యారు.

సదరు నిందితుడు చెప్పిన సంఘటనా స్థలానికి హుటాహుటినా చేరుకున్నారు. అక్కడ నిందితుడి భార్య అర్చన నేలపై విగత జీవిగా పడి ఉంది. దీంతో వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు ఆమె అప్పటికే చనిపోయిందని ధృవీకరించారు. దీంతో పోలీసులు నిందితుడు యోగేశ్‌ కుమార్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ప్రాథమిక విచారణలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు తేలిందని పోలీసులు అన్నారు. దీంతో అతడి భార్య అర్చన తనకు తెలిసిన వారి నుంచి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకుంది. ఈ విషయమై ఆదివారం ఆ జంట గొడపడ్డారని, ఆ తర్వాత యోగేశ్‌ కోపంతో తన భార్య అర్చనను గొంతు నులిమి చంపేశాడని తెలిపారు. 

(చదవండి: శ్రద్ధా వాకర్‌ హత్య కేసు: సీబీఐ అవసరం ఏంటి?.. పేరెంట్స్‌కి లేని అభ్యంతరాలు మీకెందుకు?)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top