గదిలోకి దూరి లైంగిక దాడికి యత్నం.. యువతిని కాపాడిన హిజ్రాలు

Man Attempted Young Woman Molestation by Entering Room Bengaluru - Sakshi

బెంగళూరు: ఇంటిలో యువతి ఒంటరిగా ఉండగా తెల్లవారుజామున సు­మారు 4 గంటల సమయంలో గది కా­లిం­గ్‌ బెల్లు కొట్టి మరీ డోర్‌ తీయగానే ఇంట్లోకి దూరి యువతిపై వేధింపులకు పా­ల్పడ్డాడో దుండగుడు. ఆమె అరుపులు విని దగ్గరిలోని ఇద్దరు హిజ్రాలు వచ్చి కాపాడారు. నగరంలో కేఆర్‌ పురంలోని వివేకనగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కోరమంగళ వద్దనున్న ఈజిపురలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మసురుల్‌ షేక్‌ అని పోలీసులు తెలిపారు. ఈజిపురలో నివాసముంటూ నర్సింగ్‌ కోర్సు చదువుకుంటున్న మిజోరాంకు చెందిన యువతిపై దుండగుడు కన్నేశాడు. 

రోజూ కాలింగ్‌ బెల్‌ కొట్టి..  
ఒక హోటల్లో పనిచేసే మసురుల్‌ షేక్‌  రోజూ తెల్లవారు జామున యువతి గది డోర్‌బెల్‌ కొట్టి పారిపోయేవాడు. ఆమె డోర్‌ తీసి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజాము కూడా అదే మాదిరిగా బెల్‌ కొట్టాడు. ఆమె డోర్‌ తీయగానే గదిలోకి చొరబడి యువతిపైన లైంగిక దాడికి యత్నించగా  కేకలు వేసింది. అక్కడ సమీపంలో ఉన్న ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌ వచ్చి యువతిని కాపాడి అతన్ని పట్టుకున్నాడు. స్థానికులు వచ్చి దుండగునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

చదవండి: (రూ.80 వేల జీతం, అయినా సరిపోలే.. భార్యను నిత్యం అనుమానిస్తూ..)  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top