యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఆన్‌లైన్‌ గేమ్‌  | Man attempted suicide | Sakshi
Sakshi News home page

యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఆన్‌లైన్‌ గేమ్‌ 

Mar 22 2024 4:36 AM | Updated on Mar 22 2024 4:36 AM

Man attempted suicide - Sakshi

లెక్కలో రూ.6 లక్షల తేడాతో పెట్రోల్‌బంక్‌ యాజమానుల ఫిర్యాదు 

రికవరీ పేరిట ఇంటిని రాయించుకున్న వైనం 

మనస్తాపంతో క్రిమిసంహారక మందు తాగిన యువకుడు  

పరకాల: ఆన్‌లైన్‌ గేమ్‌ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చి ంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో గురువారం రాత్రి వెలుగులోకి వచ్చి ంది. బాధితుడి తల్లి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాలలోని వెలుమవాడకు చెందిన ఎండీ గౌస్‌పాషా గుడెప్పాడ్‌లోని జీకే పెట్రోల్‌ బంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గౌస్‌పాషా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాందించాలనే ఆలోచనతో రమ్మీ ఆన్‌లైన్‌ గేమ్‌కు అలవాటు పడి బంక్‌కు సంబంధించిన రూ.6లక్షలు పొగొట్టాడు. దీంతో బంక్‌ యజమానులు ఈ నెల 18న ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అంతటితో ఆగకుండా ఆ డబ్బులు రికవరీ చేసేందుకు గౌస్‌పాషా ఇంటిని రూ.100 స్టాంప్‌ కాగితంపై రాయించుకున్నారు. అదే రోజు ఇంటికి చేరుకున్న గౌస్‌పాషా ఎంతో కష్టపడి తన తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటిని బంక్‌ యజమానులు రాయించుకోవడం తెలిస్తే తట్టుకోలేరని మనస్తాపం చెంది ఈ నెల 19న పురుగుల మందు తాగాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని..మీరంతా తనను మరిచిపోవాలని తల్లి, తమ్ముడికి ఫోన్‌ చేశాడు. దీంతో వారు పోలీసులను సంప్రదించగా, పరకాల బంధం రోడ్డులో క్రిమిసంహారక మందు తాగి ప్రాణపాయ స్థితిలో ఉన్నట్టు గుర్తించారు.

వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తన కొడుకు ఆత్మహత్యయత్నానికి బంక్‌ యాజమానుల వేధింపులే కారణమని బాధితుడి తల్లి ఎండీ ఫర్వీనా పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పరకాల సీఐ రవిరాజుకు ఫోన్‌చేయగా స్పందించలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement