పాతబస్తీలో కత్తిపొట్ల కలకలం | Man Attacked Brother With Knife In Pathabasthi Hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో కత్తిపొట్ల కలకలం

Jan 26 2022 8:32 PM | Updated on Jan 26 2022 8:40 PM

Man Attacked Brother With Knife In Pathabasthi Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో అన్నాతమ్ముల మధ్య తలెత్తిన ఘర్షణ కత్తిపోట్ల వరకు దారితీసింది. ఈ ఘటన చంద్రయాణాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓమర్ గుల్షాన్ ఫంక్షన్ హాల్ షైక్ జావీద్ (అన్న) షైక్ అసిఫ్ (తమ్ముడు)కి ఏదో విషయమై వివాదం తలెత్తింది. వారి మధ్య మొదలైన వాగ్వాదం పెరగడంతో అన్న షైక్‌ జావీద్‌ కోపంతో చాకు తీసుకుని షైక్ అసిఫ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో అసిఫ్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ అసిఫ్‌ని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు షేక్ జావిద్‌ని అదుపులోకి తీసుకున్నారు.

(చదవండి: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఈ విషాదం ఉండేది కాదు! )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement