నెల క్రితమే ప్రేమ పెళ్లి.. ఏమైందో తెలియదు.. భార్యపై కత్తితో దాడి | Man Attack On His Wife In Prakasam District | Sakshi
Sakshi News home page

ప్రకాశంలో జిల్లాలో దారుణం.. నెల క్రితమే ప్రేమ పెళ్లి.. ఏమైందో తెలియదు.. భార్యపై కత్తితో దాడి

Feb 2 2022 12:52 PM | Updated on Feb 2 2022 1:42 PM

Man Attack On His Wife In Prakasam District - Sakshi

సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం పోతవరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. భార్య కొత్తా పావని పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం పావనిని ఒంగోలు హాస్పిటల్‌కు తరలించారు. దాడి చేసిన భర్త సాయికుమార్‌ పరారీలో ఉన్నాడు.

పావని దంపతులు గత నెల 18న ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త వేధిస్తున్నాడని పావని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త సాయికుమార్‌.. పావనిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే, పెళ్లయి నెలకూడా తిరక్కుండానే ఈ దారుణం చోటుచేసుకోవడంతో భార్యభర్తల మధ్య గొడవకు మరేదైన కారణం ఉందేమోనని స్థానికులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement