ఇంటి యజమాని కొడుకుతో వివాహేతర సంబంధం.. భర్తకు తెలిసి

Man Assassination House Owner son Over Extramarital Affair in Nirmal - Sakshi

సాక్షి, నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రం నిర్మల్‌లో గురువారం సంచలనం సృష్టించిన జుబేర్‌ఖాన్‌ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని డీఎస్పీ ఉపేంద్రరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పట్టణ పోలీసుస్టేషన్‌లో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని గాజులపేటకు చెందిన ముంతాజ్‌ఖాన్‌ నివాసంలో మహమ్మద్‌ ఫయాజ్‌(40) తన రెండో భార్యతో అద్దెకు ఉంటూ పాల వ్యాపారం చేస్తున్నాడు. వీరికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అద్దె ఇంటి యజమాని ముంతాజ్‌ఖాన్‌ పెద్ద కుమారుడు జుబేర్‌ఖాన్‌(22) ఫయాజ్‌ రెండో భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో ఫయాజ్‌ పలుమార్లు జుబేర్‌ను మందలించాడు.

సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ఉపేంద్రరెడ్డి

వారి ఇంటిని ఖాళీ చేసి సమీపంలోని గంజ్‌బక్ష్‌ ఏరియాలో అద్దెకు తీసుకున్నాడు. అయినా జుబేర్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు. పలుమార్లు పెద్దలతో చెప్పించినా, ఆయన సిమ్‌కార్డు తీసుకున్నా.. అలాగే కొనసాగించాడు. భార్య, పిల్లలు తనకు దక్కరని ఫయాజ్‌ భావించాడు. జుబేర్‌ను చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఐదురోజుల క్రితమే భార్యాపిల్లలను హైదరాబాద్‌లో ఉంటున్న తన తల్లి వద్దకు పంపించాడు. తన భార్య టైలర్‌ కత్తెర తీసుకొని స్కూటీలో పెట్టుకున్నాడు. గురువారం సాయంత్రం స్థానిక బైల్‌బజార్‌ దాటిన తర్వాత పెట్రోల్‌బంక్‌ వద్ద జుబేర్‌ను చూశాడు. మాట్లాడేది ఉందంటూ పెట్రోల్‌ బంకు పక్కన గల రాయల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ముందుకు తీసుకెళ్లాడు.

చదవండి: (Hyderabad: అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం.. పోలీసుల దాడి)

తన భార్యతో సంబంధం వదులుకోవాలని ఎంత హెచ్చరించినా జుబేర్‌ వినలేదని, కోపోద్రిక్తుడైన ఫయాజ్‌ తన వెంట తెచ్చుకున్న కత్తెరతో ముందుగా జుబేర్‌ గొంతు కోశాడని డీఎస్పీ తెలిపారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే గుండెలో, కడుపులో విచక్షణారహితంగా పొడిచి చంపాడని, అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడని వివరించారు. సమావేశంలో పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top