భార్య ప్రవర్తనపై అనుమానం.. భర్త ఎంతపని చేశాడంటే? | Man Assassination His Wife On Suspicion In Nandyal District | Sakshi
Sakshi News home page

భార్య ప్రవర్తనపై అనుమానం.. భర్త ఎంతపని చేశాడంటే?

Aug 19 2022 4:53 PM | Updated on Aug 22 2022 1:39 PM

Man Assassination His Wife On Suspicion In Nandyal District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

18 ఏళ్ల క్రితం మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి వచ్చి కాశీరావు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, రమాదేవి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

మహానంది(నంద్యాల జిల్లా): భర్త చేతిలో భార్య దారుణహత్యకు గురైన ఘటన గాజులపల్లె గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ నాగార్జున రెడ్డి తెలిపిన వివరాలు.. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సత్యవోలు గ్రామానికి చెందిన కాశీరావు, గిద్దలూరు మండలం జయరామాపురం గ్రామానికి చెందిన నాగం రమాదేవి(37)లకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది.
చదవండి: ఫైనాన్స్‌ వ్యాపారి బ్లాక్‌మెయిల్‌.. మహిళ న్యూడ్‌ వీడియో వెబ్‌సైట్‌లో పెట్టి..

18 ఏళ్ల క్రితం మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి వచ్చి కాశీరావు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా, రమాదేవి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో సాయంత్రం గొడ్డలితో నరికి చంపాడని పోలీసులు తెలిపారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతురాలి తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement