వివాహేతర సంబంధం.. ఒకే గదిలో ముగ్గురు.. చివరకు..

Man Assassination With Extramarital Affair in Nandigama Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారి తీసింది. నందిగామ పట్టణంలోని ఎన్‌సీఆర్‌ క్లబ్‌ రోడ్డులో  గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి విజయ్, ఉష కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం నందిగామలోని ఓ హోటల్‌ పని చేసేందుకు వచ్చారు.

ఈ క్రమంలో ఉషకు వరి అప్పాజీ అనే వ్యక్తితో కొంత కాలంగా పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆ ముగ్గురు కూడా ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఉష, అప్పాజీ తో కూడా బాగా చనువుగా ఉంటోంది. అది నచ్చని విజయ్‌ నిద్రపోతున్న అప్పాజీని కత్తితో పీక కోసి హత మార్చాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన ఉషకు కూడా తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.    

చదవండి: (ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్‌.. వక్రబుద్ధితో..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top