హైదరాబాద్‌లో మరో హవాలా గుట్టురట్టు

సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో హవాలా గుట్టు రట్టయ్యింది. మల్లేపల్లి దగ్గర రూ.18.65 లక్షలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాచిగూడకు చెందిన బిపిన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హబీబ్‌నగర్ పోలీసులకు నిందితుడిని వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్పగించారు. ఈ సొమ్ము ఎక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి