వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..

Man Allegedly Murdered By Wife And Her Lover   - Sakshi

శిడ్లఘట్ట: శిడ్లఘట్ట తాలూకా గంజికుంటె గ్రామంలో గత ఏడాది నవంబర్‌లో  దాదాపీర్‌ అనే వ్యక్తి  అనుమానాస్పద మృతి హత్యగా తేలింది. హతుడి భార్యనే తన ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించినట్లు నిర్ధారించారు. ఈమేరకు దాదాపీర్‌ భార్య మెహర్, ఆమె ప్రియుడు తౌసీఫ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తాడనే నెపంతో నిందితులు  దాదాపీర్‌ను గ్యాస్‌ వెల్డింగ్‌ పరికరంతో కాల్చి హత్య చేశారు. అతను ఆత్మహత్య చేసుకున్నట్లు దిబ్బూరహళ్లి పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది.

అయితే దాదాపీర్‌ మృతిపై అనుమానంతో గతనెల 30న మృతుడు సోదరుడు జావీద్‌బాషా ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు మెహర్, తౌసీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని మాత్రలను పాలలో వేసి దాదాపీర్‌కు ఇచ్చామని, తాగిన దాదాపీర్‌ చలనం లేకుండా పడిపోయిన తర్వాత కాళ్లు, చేతులు కట్టివేసి గ్యాస్‌ వెల్డింగ్‌ పరికరంతో కాల్చినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. 

(చదవండి: రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top