విషాదం: కలసి బతికే అవకాశం లేదనుకుని..

Lovers End Life Thought Parents Oppose Marriage In Nirmal District - Sakshi

నిర్మల్‌ జిల్లాలో మామడ మండలంలో ఘటన

సాక్షి, మామడ(నిర్మల్‌): కులాలు వేరు కావడంతో పెళ్లికి ఒప్పుకోరని భావించి, కలసి బతికే అవకాశం లేదనుకున్న ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్‌ జిల్లా మామడ మండలంలో జరిగింది. పొన్కల్‌ గ్రామంలో ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసిన, కోండ్ర నిశిత(18), నిర్మల్‌లోని ప్రైవేట్‌ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న సిలివేరి హరీశ్‌(21) గ్రామంలోని ఒకే కాలనీకి చెందినవారు కావడంతో వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది.

వీరిద్దరివి వేర్వేరు కులాలు కావడంతో తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని భావించిన ప్రేమజంట బుధవారం నిశిత ఇంట్లో ఒకే చీరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ‘కలిసి ఉండలేం.. అందుకే చనిపోతున్నాము. నన్ను క్షమించండి.. అమ్మానాన్న..’అంటూ హరీశ్‌ వాట్సాప్‌ స్టేటస్‌ ఉండటం చూసి అతడి మిత్రులు, కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. కుటుంబ సభ్యులు వెతకగా నిశిత ఇంట్లో విగతజీవులుగా కనిపించారు.

చదవండి: జూబ్లీహిల్స్‌: లైసెన్స్‌డ్‌ గన్‌కు పని చెప్పమంటావా..?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top