పంచాయితీ పెట్టినా వినలేదు.. ఆమెతో వివాహేతర సంబంధం.. చివరకు | Lovers Commit Suicide Due To Extra Marital Affair In Kurnool | Sakshi
Sakshi News home page

వరుసకు వదినతో వివాహేతర సంబంధం.. చివరకు ఇలా ట్విస్ట్‌!

Jan 11 2023 10:41 AM | Updated on Jan 11 2023 10:51 AM

Lovers Commit Suicide Due To Extra Marital Affair In Kurnool - Sakshi

బేతంచెర్ల: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కాగా, బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..  ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామానికి చెందిన  కమలపాటి అశోక్‌ (28)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఆటోనడుపుకుంటూ జీవిస్తున్నాడు. 

అయితే, అశోక్‌ వరుసకు వదిన అయిన వివాహిత(27)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో పెద్దలు ఇద్దరికి నచ్చ జెప్పారు. అయినా, వారిలో మార్పు రాలేదు. దీంతో అశోక్‌ను వదిలి నెలరోజుల క్రితం  భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మరోవైపు వివాహితను కుటుంబ సభ్యులు మందలించారో మరెమో తెలియదు  మంగళవారం ఉదయం ఆమె  అశోక్‌ ఇంటికెళ్లింది. 

ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.  అశోక్‌ ఉరివేసుకోగా, ఆమె పురుగుల మందు తాగింది. కొద్ది సేపటి తర్వాత ఇంటి పక్కల వారు గమనించి తలుపులు తీయగా ఇద్దరు విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న సీఐ ప్రియతం రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. తర్వాత ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం బనగాన పల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement