ప్రేమ జంట ఆత్మహత్య | Love Pair End Life In Tirupati District | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట ఆత్మహత్య

May 29 2025 8:16 PM | Updated on May 29 2025 9:00 PM

Love Pair End Life In Tirupati District

తిరుపతి జిల్లా: జిల్లాలోని నాయుడుపేటలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నాయుడుపేటలోని అమరావతి లాడ్జి నందు ప్రేమ జంట  బలవన్మరణానికి పాల్పడిని ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యకు పాల్పడిన జంటను కుప్పరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మణి, శిరీషగా గుర్తించారు. 

ఈ ఘటనలో శిరీష ఉరి వేసుకుని ఉండగా, మణి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కుటుంబ సభ్యుల సమక్షంలోనే లాడ్జి గది తలుపులు పగలగొట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement
 
Advertisement
Advertisement