మహిళపై అత్యాచారం.. ఇనుప రాడ్‌తో..

Love Jihad: Brother Molested Woman And Forced To Change Religion - Sakshi

ఆపై మతం మారాలని ఒత్తిడి

బెంగళూరులో లవ్‌జిహాద్‌ ఉదంతం 

బనశంకరి: కర్ణాటకలో లవ్‌ జిహాద్‌ ఉదంతం కలకలం రేపుతోంది. యువతిపై అత్యాచారానికి పాల్పడి మతం మారాలి బలవంతం చేసిన కేసులో ఒకరిని సోమవారం బెంగళూరు చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీసులు అరెస్ట్‌చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. వివరాలు.. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన షబీర్‌ అహ్మద్, రిల్హాన్‌ సోదరులు  బెంగళూరులో హోటల్‌ నడుపుతున్నారు. 2018లో వారి హోటల్‌లో రిసెప్షనిస్టుగా చేరిన 19 ఏళ్ల యువతిని షబ్బీర్‌ అహ్మద్‌ ఓ లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. 2019లో నాలుగుసార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టడంతో పాటు ఎవరికైనా ఈ విషయం చెబితే ఉద్యోగం తీసేస్తానని, యాసిడ్‌ పోస్తానని బెదిరించాడు. తరువాత రిల్హాన్‌ ఆమెను కలిసి నా సోదరుడు నీకు అన్యాయం చేశాడని తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత యువతి తల్లిదండ్రులతో నిశ్చితార్థం పేరు చెప్పి 2 నెలల క్రితం రూ. 1.50 లక్షలు తీసుకున్నాడు. చదవంండి: నిమ్స్‌లో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య  

తెల్లకాగితంపై సంతకాలు.. 
గతేడాది నవంబరు 20న పెళ్లికి ఫంక్షన్‌ హాల్‌ను మాట్లాడి, పెళ్లిపత్రికలు కూడా ముద్రించారు. ఈ సమయంలో దుబాయ్‌లో మంచి ఉద్యోగం ఉంది, పాస్‌పోర్ట్‌ కోసమంటూ ఖాళీ పేపర్లపై సంతకం చేయించుకుని మతం మారాలని బలవంతం చేసి మాయమయ్యాడు. అయితే.. అతను అప్పటికే వేరేవారిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం బాధితురాలు షబీర్, రిల్హాన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి షబీర్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపడుతున్నారు. చదవండి: మతాంతర వివాహం: ఆ హక్కు ఎవరికీలేదు

మధ్యప్రదేశ్‌లో దారుణం
సిద్ధి: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడిన నలుగురు దుండగులు ఆమె మర్మావయవాల్లోకి ఐరన్‌ రాడ్‌ను గుచ్చారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సిద్ధి జిల్లా అమిలియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొండప్రాంత గ్రామం హర్దికి చెందిన మహిళ(45) నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఉపాధి కోసం తన గుడిసెలోనే కిరాణ దుకాణం నడుపుకుంటోంది. ఆమె ఇద్దరు కుమారులు(16, 18), సోదరి(40) ఆ ఇంట్లోనే ఉంటారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో గ్రామానికే చెందిన నలుగురు ఆమె ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారం చేశారు. అనంతరం ఇనుప రాడ్‌ను ఆమె మర్మావయవాల్లోకి గుచ్చారు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్పృహతప్పి పడిపోయింది. ఆ సమయంలో ఆమె సోదరి మాత్రమే ఇంట్లో ఉంది. ఆమె అతికష్టమ్మీద ఆటోలో సమీప పోలీస్‌ ఠాణాకు బాధితురాలిని తీసుకెళ్లింది. పోలీసులు బాధితురాలిని సిద్ధి ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రేవా జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని పోలీసులు తెలిపారు. నిందితులు నలుగురినీ అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top