వామ్మో.. కిలేడీ గ్యాంగ్‌.. బంగారం కొనేందుకు వచ్చి.. ఎంత పనిచేశారు!

Lady Thief Gang Arrested In Khammam - Sakshi

సాక్షి, కొత్తగూడెంటౌన్‌(ఖమ్మం): పట్టణ పరిధిలోని చిన్నబజార్‌లోని నగల షాపులో చోరీలకు పాల్పడిన ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొత్తగూడెం త్రీటౌన్‌ సీఐ వేణుచందర్‌ కథనం ప్రకారం... చిన్నబజార్‌లోని శ్రీనిధి జ్యూయలరీ షాపులో ఈ నెల 23న ఐదుగురు మహిళలు బంగారం కొనేందుకు వచ్చి రూ.60 వేల విలువైన బంగారు చెవి దిద్దులు దొంగిలించారు. యాజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం సాయంత్రం కొత్తగూడెం బస్టాండ్‌లో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహబూబాబాద్‌ జిల్లాలోని నర్సింహులపేటలోని షకీరాతండాకు చెందిన గుగులోతు గోబీ, భూక్యా బుల్లి, భూక్యా మంగతి, భూక్యా అంకు, భూక్యా సీతలుగా గుర్తించారు.

వీరు కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ఖమ్మం, సిద్దిపేట, జిల్లాల్లో వస్త్ర దుకాణాల్లో, బంగారం షాపుల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. వీరిపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్‌లలో 25 కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి బంగారు చెవి దిద్దులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు.  

చదవండి: నాలుగు నెలల్లో రెట్టింపు నగదు.. లగ్జరీ కారు.. కట్‌ చేస్తే..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top