డ్రగ్స్‌ పెడ్లర్‌ టోనీ కేసులో కీలక పరిణామం | Key Development In The Case Of Dugs Peddler Tony | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ పెడ్లర్‌ టోనీ కేసులో కీలక పరిణామం

Jan 30 2022 3:54 PM | Updated on Jan 30 2022 4:14 PM

Key Development In The Case Of Dugs Peddler Tony - Sakshi

హైదరాబాద్‌: డ్రగ్స్‌ పెడ్లర్‌ టోనీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టోనీ దగ్గర నుంచి 2 సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అయితే సెల్‌ఫోన్‌లో డేటా మొత్తాన్ని డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాట్సాప్, ఫేస్‌టైమ్ డేటాను ఎప్పటికప్పుడు టోని డిలీట్ చేశాడు. వాట్సాప్ చాటింగ్‌లు కూడా  ప్రతిరోజు డిలీట్ చేసినట్లుగా గుర్తించారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ముందుస్తుగా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది.

దీంతో డేటా అనాలసిస్ కోసం ఫోరెన్సిక్‌ పంపించారు పోలీసులు. ఈ క్రమంలో టోనీ కాంటాక్ట్స్ లిస్టును పోలీసులు రిట్రీవ్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్తలతో టోనీ టచ్‌లో ఉన్నట్లుగా విచారణలో గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వ్యాపారవేత్తల చిట్టాతో విచారణ చేపడుతున్నారు. టోనీ, వ్యాపారవేత్తల మధ్య ఉన్నసంబంధాలు గురించి టాస్క్‌ఫోర్స్‌ ఆరా తీస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement