కరీంనగర్‌: రైతు మీద నుంచి ధాన్యం లోడ్ ట్రాక్టర్‌ వెళ్లి.. | Karimnagar Crime News: Grain loading Tractor Kills Farmer | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌: ఘోరం.. నిద్రిస్తున్న రైతు మీద నుంచి ధాన్యం లోడ్ ట్రాక్టర్‌ వెళ్లి..

Published Sat, May 27 2023 8:37 AM | Last Updated on Sat, May 27 2023 9:53 AM

Grain loading Tractor Kills Farmer - Sakshi

సాక్షి, కరీంనగర్‌: తిమ్మాపూర్‌ మండలం వచ్చునూర్‌ గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిద్రిస్తున్న రైతు మీద నుంచి లోడ్‌తో ఉన్న ట్రాక్టర్‌ వెళ్లింది. దీంతో రైతు అక్కడిక్కడే మృతి చెందారు.

మృతి చెందిన రైతును 60 ఏళ్ల వయసున్న ఉప్పులేటి మొండయ్యగా గుర్తించారు. ఐకేపీ సెంటర్‌కు చేరుకున్న మొండయ్య.. వర్షానికి ధాన్యం తడవకుండా ఉండే కవర్‌ను కప్పుకుని పడుకున్నాడు. ఈ క్రమంలో అది గమనించని ట్రాక్టర్‌ డ్రైవర్‌.. అటుగా పోనివ్వడంతో మొండయ్య స్పాట్‌లోనే కన్నుమూశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా.. బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement