breaking news
Thimmapur mandal
-
కరీంనగర్: రైతు మీద నుంచి ధాన్యం లోడ్ ట్రాక్టర్ వెళ్లి..
సాక్షి, కరీంనగర్: తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిద్రిస్తున్న రైతు మీద నుంచి లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ వెళ్లింది. దీంతో రైతు అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన రైతును 60 ఏళ్ల వయసున్న ఉప్పులేటి మొండయ్యగా గుర్తించారు. ఐకేపీ సెంటర్‌కు చేరుకున్న మొండయ్య.. వర్షానికి ధాన్యం తడవకుండా ఉండే కవర్‌ను కప్పుకుని పడుకున్నాడు. ఈ క్రమంలో అది గమనించని ట్రాక్టర్ డ్రైవర్.. అటుగా పోనివ్వడంతో మొండయ్య స్పాట్లోనే కన్నుమూశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా.. బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బిడ్డా శ్యామ్.. గుండెలు అవిసేలా ఏడుస్తూ కుప్పకూలింది
సాక్షి, కరీంనగర్: భార్య మృతిని తట్టుకోలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడితే.. అది తట్టుకోలేక అతని తల్లి గుండె బద్ధలైంది. తిమ్మపూర్ మండలం నెదునూరు గ్రామంలో చోటు చేసుకున్న విషాదానికి మరో మరణం తోడయ్యింది. భార్య మృతితో ఒంటరి జీవనం గడుపుతున్న శ్యామ్ సుందర్.. భార్య ఎక్కడైతే ఆత్మహత్యకు పాల్పడిందో అదే ప్రదేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం తెలిసే ఉంటుంది. అయితే.. కొడుకు మృతిని తట్టుకోలేక 24 గంటలు గడవకముందే అతని తల్లి సైతం ప్రాణం విడిచింది. కొడుకు అంత్యక్రియల తర్వాత ఇంటికి చేరుకున్న కనకలక్ష్మి గుండెలు అవిసేలా ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఛాతీలో నొప్పి రావడంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు బంధువులు. కానీ, మార్గం మధ్యలోనే కన్నుమూసింది. కొడుకు చనిపోయిన కొద్దిగంటలకే కనకవ్వ సైతం కన్నుమూయడంతో ఊరంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన శ్యామ్ సుందర్(35) ఆర్కెస్ట్రా గాయకుడు. ఏడాది కిందట.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన శారదతో వివాహం జరిగింది. దాదాపు ఏడు నెలల కిందట.. శారద హుస్నాబాద్ లోని ఓ బహిరంగ ప్రదేశంలో చెట్టుకు ఉరేసుకొని చనిపోయింది. మనస్పర్థల కారణంగా ఆమె చనిపోయినట్లు తేలింది. అయితే.. భార్య ఎడబాటును తట్టుకోలేని భర్త శ్యాంసుందర్ తన పెళ్లి రోజునే అతని భార్య ఉరివేసుకొని చనిపోయిన చెట్టు దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఆ బాధను తట్టుకోలేని తల్లి కూడా కొడుకు దగ్గరికే చేరుకుందేమో!. -
నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి: ప్రొ.కోదండరామ్
కరీంనగర్ : నేదునూరులో జెన్కో పవర్‌ప్లాంట్ పనులు వెంటనే చేపట్టి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. లేకుంటే భూములును తిరిగి రైతులకు అప్పగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. గురువారం కోదండరామ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో జెన్కో పవర్ ప్లాంట్ కోసం సేకరించిన భూములను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులతో కోదండరామ్ సమావేశమయ్యారు.