కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ వేసవి కార్యాచరణ పూర్తి చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ రాపెల్లి రవీందర్ ఆదేశించారు. కరీంనగర్ విద్యుత్ భవన్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా సమీక్షలో మాట్లాడుతూ.. పోల్ నంబరును ఆన్‌లైన్‌లో జీఐఎస్ కో–ఆర్డినేటర్స్‌తో డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు సర్వీసు మంజూరు చేయాలన్నారు. గృహ వినియోగదారుల మీటర్లు బిగించాలన్నారు. లైన్ పనులు, ట్రాన్స్‌ఫార్మర్ చార్జ్ అయిన వెంటనే వర్క్ ఆర్డర్ క్లోజ్ చేయాలన్నారు. ఆన్‌లైన్‌లో ఎల్‌సీ తీసుకోవడంతో పాటు భద్రత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రజాబాట కార్యక్రమాన్ని తమ సెక్షన్ల పరిధిలో మంగళ, గురు, శనివారాల్లో నిర్వహించాలని ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్ల కాలిపోతే విద్యుత్‌శాఖ వాహనంలోనే రవాణా చేయాలన్నారు. వాట్సప్ చాట్‌బాట్ 7901628348 నంబరు, 1912 టోల్‌ఫ్రీ ద్వారా విద్యుత్ సమస్యలు తెలియజేయాలన్నారు. డీఈలు కే.ఉపేందర్, జె.రాజం, లక్ష్మారెడ్డి, ఎం.తిరుపతి, చంద్రమౌళి, రమణారెడ్డి, ఎస్‌ఏవో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ఎస్‌ఈ రాపెల్లి రవీందర్


