కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొత్త ట్విస్ట్ | Kadiri Sub Registrar Office Fake Challan Investigation At Anantapur | Sakshi
Sakshi News home page

కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొత్త ట్విస్ట్

Sep 26 2021 9:21 AM | Updated on Oct 17 2021 4:23 PM

Kadiri Sub Registrar Office Fake Challan Investigation At Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలోని కదిరి సబ్‌రిజిస్టర్‌ కార్యాలయంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అక్రమాలపై విచారణ జరుగుతుండగానే రాత్రికి రాత్రే రూ.21.50 లక్షల చలానా డబ్బును ముగ్గురు ఉద్యోగులు జమ చేశారు. దీంతో ఉన్నతాధికారులు నకిలీ చలానాలపై విచారణ చేపట్టారు. రూ.5 వేల చలానాకు రూ.50 వేలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగులు మార్చారు.

సబ్ రిజిస్టర్ నాసీర్, సీనియర్ అసిస్టెంట్ షామిర్ బాషా, జూనియర్ అసిస్టెంట్ హరీష్ ఆరాధ్యలను అధికారులు విచారిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లతో కలిసి కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement