Hyderabad IIT Btech Student Commits Suicide, Police Suspects That Due To Stress Of Her Studies - Sakshi
Sakshi News home page

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్‌ లెటర్‌ రాసి..

Aug 8 2023 7:05 AM | Updated on Aug 8 2023 6:34 PM

Iit Hyderabad Student Commits Suicide - Sakshi

సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్‌ ఐఐటీలో బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థిని మమైత (20) ఆత్మహత్యకు పాల్పడింది.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్‌ ఐఐటీలో బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థిని మమైత (20) ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌లోని తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన మమైత జూలై 26న క్యాంపస్‌కు వచ్చినట్లు చెబుతున్నారు.

ఒరియా భాషలో రాసిన సూసైడ్‌ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. సంగారెడ్డి డీఎస్పీ పి రమేశ్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మమైత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువు విషయంలో ఒత్తిడికి గురి కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: వివాహితకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి నగ్న వీడియోలు తీసి...   

Advertisement
 
Advertisement
Advertisement