వివాహితకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి నగ్న వీడియోలు తీసి... | - | Sakshi
Sakshi News home page

వివాహితకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి నగ్న వీడియోలు తీసి...

Aug 8 2023 6:18 AM | Updated on Aug 8 2023 6:52 AM

- - Sakshi

హైదరాబాద్: వివాహితకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి నగ్న వీడియోలు తీసి డబ్బులు కావాలంటూ డిమాండ్‌ చేస్తున్న నిందితుడిని పంజగుట్ట పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్టణానికి చెందిన వివాహిత (26)కు నాలుగేళ్ల క్రితం ఆన్‌లైన్‌ ద్వారా బోనాల చెన్నకేశవులు (31)తో పరిచయం ఏర్పడింది.

తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. వివాహితకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్న చెన్నకేశవులు తనకు తెలిసిన వెబ్‌సైట్‌ ఉందని, అందులో ముఖానికి మాస్క్‌ పెట్టుకుని నీలి చిత్రంలో నటిస్తే రూ.10 లక్షలు ఇస్తారని నమ్మబలికాడు. దీంతో ఆమె గత నెల 12న నగరానికి వచ్చి పంజగుట్ట ప్రాంతంలో ఓ హోటల్‌లో దిగింది. చెన్న కేశవులు ఆమెకు డ్రింక్‌లో మద్యం కలిపి తాగించాడు. ఆమె మత్తులోకి వెళ్లగానే నగ్నంగా వీడియోలు, ఫొటోలు తీశాడు.

కొద్దిరోజుల తర్వాత ఆమెకు ఫోన్‌ చేసి రూ. లక్ష ఇవ్వాలని లేనిపక్షంలో నీ నగ్న వీడియోలు, ఫొటోలు పోర్న్‌ సైట్లలో పెడతానని బెదిరించాడు. ఇటీవల అతని వేధింపులకు ఎక్కువ కావడంతో ఈ నెల 2వ తేదీన బాధితురాలు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement