లాడ్జీలో వ్యభిచారం.. ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అరెస్ట్‌ | Hyderabad: Prostitution In Lodge At LB Nagar, 6 Arrested | Sakshi
Sakshi News home page

లాడ్జీలో వ్యభిచారం.. ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అరెస్ట్‌

Oct 11 2022 5:06 PM | Updated on Oct 11 2022 5:36 PM

Hyderabad: Prostitution In Lodge At LB Nagar, 6 Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాడ్జీలో వ్యభిచారం చేయిస్తున్న లాడ్జీ యజమానితో పాటు ఐదుగురిని ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్‌బీనగర్‌ కామినేని హాస్పిటల్‌ ఎదురుగా కర్నాటి రామారావు అనే వ్యక్తి శ్రీ వెంకటేశ్వర లాడ్జీని నిర్వహిస్తున్నాడు. రిసెప్షనిస్ట్‌గా యడ్డ సహదేవ్‌ పని చేస్తున్నాడు. సెక్స్‌ వర్కర్లను నియమించుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్‌ పోలీసులు ఆదివారం రాత్రి వెంకటేశ్వర లాడ్జీపై దాడి  చేసి తనిఖీలు చేపట్టారు. విటులు దేవరాజు, మాణిక్‌ స్వరూప్, కర్నూల్‌ ప్రాంతాన్ని చెందిన ఒక మహిళ, నల్గొండ జిల్లా డిండికి చెందిన మరో మహిళ పట్టుబడ్డారు. లాడ్జీ నిర్వాహకులు కర్నాటి రామారావు, సహదేవ్‌ను కూడా అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement