తస్మాత్‌ జాగ్రత్త: స్కూటీ ఇచ్చాడు ఏ-1 గా జైలుకెళ్లాడు

Hyderabad Police Arrested Man Who Give Bike to His Unlicensed Friend - Sakshi

లైసెన్స్‌ లేని వారికి వాహనం ఇస్తే జైలుకే..

మూసాపేట: తెలిసిన వారే కదా అని డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారికి వాహనం ఇచ్చిన, ప్రమాదాలు జరిగినప్పుడు వాహనం యజమానే నిందితుడిగా అవుతారు. ఇతరుల వాహనం నడిపే క్రమంలో లైసెన్స్‌ లేని వ్యక్తి ప్రమాదం బారిన పడితే వాహనం యజమాని జైలుకు వెళ్లిన ఘటన తాజా కేసుతో ఈ విషయం వెల్లడైంది.

స్నేహితురాలికి తన స్కూటీ ఇస్తే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో స్కూటీ యజమాని అయిన స్నేహితుడిని ప్రధాన నిందితుడిగా చేస్తూ, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను రెండవ నిందితుడిగా పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో దంత విద్యార్థిని ఆది రేష్మా మరణించిన విషయం విదితమే. ఈ  కేసులో స్కూటీ యజమాని అజయ్‌సింగ్‌ (23), హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టూడెంట్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 
(చదవండి: రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top