రెండేళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. కేకలు వేయడంతో.. | Hyderabad: Man arrested for misbehaving with 2 Years Old girl In Hayathnagar | Sakshi
Sakshi News home page

రెండేళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. కేకలు వేయడంతో..

Jan 21 2022 8:05 AM | Updated on Jan 21 2022 11:59 AM

Hyderabad: Man arrested for misbehaving with 2 Years Old girl In Hayathnagar - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి హయత్‌నగర్‌: అభం శుభం ఎరుగని రెండేళ్ళ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన మేరు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గుల్షన్‌ సహాని (26) పెయింటింగ్‌ పనులు చేస్తూ హయత్‌నగర్‌లో నివాసముంటున్నాడు. ఈ నెల 12న సమీపంలో నివసించే ఓ రెండేళ్ళ బాలికతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు నిందితున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  

బస్సు ఢీకొని రిటైర్డ్‌ ఉద్యోగి మృతి 
నాగోలు:
ఆర్టీసీ బస్సు ఢీకొని రిటైడ్డ్‌ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్‌బీనగర్‌ చిత్రలేవుట్‌ కాలనీలో నివాసం ఉండే కజ్జం మల్లయ్య(76) రిటైర్డ్‌ ఉద్యోగి. బుధవారం సాయంత్రం శివగంగ కాలనీ నుంచి ఎల్‌బీనగర్‌ చౌరస్తా వైపు పల్సర్‌ బైక్‌పై తిరిగి వస్తున్నాడు. సిరీస్‌ రోడ్డు ఎస్‌బీఐ ఏటీఎం వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్‌ను వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. దీంతో మల్లయ్య తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్ధితికి చేరుకున్నాడు. స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు తరలించగా, వైద్యులు పరీక్షించి మల్లయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్‌బీనరగ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   
చదవండి: అల్వాల్‌లో ప్రత్యక్షం.. ఉప్పల్‌లో అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement