గొంతు నులిమి చంపాలనుకున్నాడు.. కానీ | Husband Try To Assasinate Wife In Khammam | Sakshi
Sakshi News home page

గొంతు నులిమి చంపాలనుకున్నాడు.. కానీ

Mar 3 2021 6:55 PM | Updated on Mar 3 2021 7:54 PM

Husband Try To Assasinate Wife In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: కట్టుకున్న భార్యను గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన ఖమ్మంలోని టీఎన్జీవోస్‌ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. చిలకకోయలపాడుకి చెందిన నాగేశ్వరరావు, నవ్య దంపతులు. గత కొంతకాలంగా భర్త పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలేక ఆమె దూరంగా ఉంటుంది.పిల్లలను తీసుకోని ఏన్జీవోస్ కాలనీలో అద్దెకు ఉంటుంది.

అయితే ఈ విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు ఆమెను ఏలాగైనా హత్య చేయాలని భావించాడు.దీనిలో బాగంగా ప్లాన్ ప్రకారం ఏన్జీవోస్ కాలనీలోని చెట్ల పొదల్లో ఉన్న గుంతలోకి తీసుకువెళ్లి నవ్య గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు నాగేశ్వరరావుని అడ్డుకొని అతనిపై రాళ్లు విసిరారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో నాగేశ్వరరావును ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా నవ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాము చూడకపోయుంటే తన భార్యను చంపేసేవాడని స్థానికులు పేర్కొన్నారు. 
చదవండి: 
దారుణం : కన్నబిడ్డనే చంపి నదిలో పడేశారు
సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య?

Advertisement
 
Advertisement
Advertisement