భర్త వేధింపులు.. యువ వైద్యురాలు ఆత‍్మహత్య | Husband Dowry Harassment Wife Commits Suicide | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులు.. యువ వైద్యురాలు ఆత‍్మహత్య

May 29 2022 11:03 AM | Updated on May 29 2022 11:39 AM

Husband Dowry Harassment Wife Commits Suicide - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యోదయనగర్‌లో వరకట్న వేధింపులకు యువ వైద్యురాలు బలైంది. వివరాల ప్రకారం.. వైద్యురాలు వంగా భారతితో డాక్టర్‌ కొండగట్టు రమేష్‌కు గత డిసెంబర్‌లో వివాహమైంది. కాగా, అదనపు కట్నం తేవాలని రమేష్‌.. భారతిని వేధింపులకు గురిచేశాడు.

కొత్తగా మరో ఆసుపత్రి పెడదామంటూ కట్నం కోసం ఆమెను వేధించాడు. ఈ క్రమంలో రమేష్‌ వేధింపులు భరించలేక యువ వైద్యురాలు భారతి ఆత‍్మహత్య చేసుకుంది. ఈ మేరకు బాధితురాలు తండ్రి శంకరయ్య పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రమేష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement