భర్త నిర్వాకం.. రెండో వివాహం చేసుకొని.. మొదటి భార్యను..

Husband Assassination His First Wife In Hanamkonda District - Sakshi

పరకాల(హనుమకొండ జిల్లా): రెండో వివాహం చేసుకున్న ఓ భర్త  మొదటి భార్యను తీవ్రంగా చితకబాది అంతమొందించాడు. పరకాల మండలం వెంకటాపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ పుల్యాల కిషన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తురాయి శంకర్‌ రెండో వివాహం చేసుకుని మొదటి భార్య తురాయి సక్కుబాయి(34)ని వేధిస్తూ తీవ్రంగా కొట్టేవాడు.

ఈ నెల 5న సక్కుబాయిని తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకుని పడిపోయింది. చిరంజీవి అనే ఓ యువకుడు గమనించి ఆమె సోదరుడికి సమాచారం అందించాడు. దీంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సక్కుబాయి మృతిచెందింది. మృతురాలి సోదరుడు మోరె రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఏసీపీ శివరామయ్య, సీఐ కిషన్‌ శనివారం గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.
చదవండి: పంట చేనుకు కాపలా వెళ్లిన యువతి.. చివరికి ఊహించని ఘటన.. అసలేం జరిగింది?

  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top