కట్నం కోసం అత్తింటి వేధింపులు.. ఠాణాకు చేరిన పంచాయితీ

Husband And Mother In Laws Harassment A Women Filed Case - Sakshi

కట్నం తేవాలని అత్తింటి వేధింపులు.. 

తరచూ భర్త దాడి చేస్తున్నాడని ఫిర్యాదు

అహ్మదాబాద్‌లో గృహహింస కేసు నమోదు

అహ్మదాబాద్‌: పెళ్లయిన పది రోజులు బాగానే ఉన్నాడు.. ఆ తర్వాత భర్తలో అనూహ్య మార్పులు. అత్తింటికి వెళ్లిన అమ్మాయికి పక్షం రోజుల్లోనే నరకం కనపడింది. అదనపు కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్తామామ కూడా వేధింపులకు పాల్పడుతున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి సర్దుకుపోదామని భార్య కలుద్దామని వెళ్తే భర్త చీత్కరిస్తున్నాడు. బెడ్రూమ్‌లో కూడా సక్రమంగా ఉండడం లేడు. మరోసారి అడగ్గా అతడు భార్యను చితకబాదిన సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
చదవండి: ఏసీ హాల్‌లో ఎందుకు? గ్రౌండ్‌లో కూడా పెళ్లి చేసుకోండి

అహ్మదాబాద్‌కు చెందిన యువతికి ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన వివాహమైంది. పెళ్లయిన పది రోజులకు కట్నం తీసుకురావడం లేదని వేధింపులు మొదలుపెట్టారు. వాటిని భరిస్తూ భర్తతోనే ఉండాలని భావించిన ఆ మహిళ బెడ్రూమ్‌లోనైనా సక్రమంగా ఉంటాడంటే అదీ లేదు. కోరి కోరి వస్తే కూడా చీత్కరిస్తున్నాడు. ఆ విషయానికి వచ్చేసరికి కోపంతో దాడి చేస్తున్నాడు. ఇక వద్దని బెడ్రూమ్‌లో వదిలేసి బయటకు వెళ్లేవాడు.
చదవండి: బీజేపీ సరికొత్త ప్రయోగం.. వారికి నో ఛాన్స్‌

‘నువ్వు అందంగా లేవు’ అని చెప్పి వివాహేతర సంబంధం ఏర్పరచుకుంటానని చెప్పినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో వాపోయింది. ఈ వేధింపులు తాళలేక ఆమె ఆగస్టు 1వ తేదీన పుట్టింటికి వచ్చింది. అయితే పెద్దలు కల్పించుకుని మళ్లీ అత్తింటికి పంపించారు. అయినా కూడా వారిలో మార్పురాలేదు. దీంతో ఆగస్టు 8వ తేదీన పుట్టింట్లో వదిలేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గృహహింస చట్టం కింద కేసు నమోదు చేయించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top