చెన్నైలో రూ.70 కోట్ల హెరాయిన్‌ స్వాధీనం  | Heroin Worth 70 Crore Seized At Chennai Airport | Sakshi
Sakshi News home page

చెన్నైలో రూ.70 కోట్ల హెరాయిన్‌ స్వాధీనం 

Jun 6 2021 4:03 AM | Updated on Jun 6 2021 4:03 AM

Heroin Worth 70 Crore Seized At Chennai Airport - Sakshi

తిరువొత్తియూరు (చెన్నై): దక్షిణాఫ్రికా నుంచి చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చిన రూ.70 కోట్ల విలువైన 9.8 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్‌ అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి దోహా నుంచి వస్తున్న ప్రత్యేక విమానంలో డ్రగ్స్‌ తీసుకొస్తున్నట్లు వచ్చిన సమాచారంతో కస్టమ్స్‌ కమిషనర్‌ రాజన్‌ చౌదరి నేతృత్వంలో అధికారులు నిఘా ఉంచారు. ప్రయాణికుల్లో ఓ మహిళ వీల్‌చైర్‌లో, ఆమెకు తోడుగా మరొక మహిళ వచ్చారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చినట్లు వారు తెలిపారు. సూట్‌కేస్‌లను తనిఖీ చేయగా నాలుగు పార్శిళ్లలో 9.8 కిలోల హెరాయిన్‌ బయటపడింది.   

Advertisement
 
Advertisement
Advertisement