గంజాయి ఆయిల్‌తో హెడ్‌కానిస్టేబుల్‌ అరెస్టు | Head Constable Arrested For Peddling Ganja And Cannabis Oil Khammam District | Sakshi
Sakshi News home page

గంజాయి ఆయిల్‌తో హెడ్‌కానిస్టేబుల్‌ అరెస్టు

Mar 19 2022 3:12 AM | Updated on Mar 19 2022 11:07 AM

Head Constable Arrested For Peddling Ganja And Cannabis Oil Khammam District - Sakshi

ఖమ్మం జిల్లా వైరాలో పట్టుబడిన  నిందితులతో ఎస్‌ఐ వీరప్రసాద్‌ 

వైరా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ఖమ్మంకు నిషేధిత గంజాయి ఆయి ల్‌ను తరలిస్తున్న ఒక హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా వైరా ఎస్‌ఐ వీరప్రసాద్‌ తెలిపిన వివరాలివి. కొత్తగూడెంలోని  ఆరో బెటాలియన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సపావత్‌ రాజ్‌కుమార్‌.. బుద్ది దుర్గాప్రసాద్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై రూ.2లక్షల విలువైన 2 బాటిళ్ల గంజాయి ఆయిల్‌తో శుక్రవారం మధ్యాహ్నం బయల్దేరాడు. వైరా సమీపాన పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో పరిశీలించగా ఆయిల్‌ బయట పడింది. వీరిని అరెస్టు చేసి మధిర కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement