‘అవి రక్తపు మరకలు కాదు పెయింట్‌’ | Sakshi
Sakshi News home page

హథ్రస్‌: నిందితుడి ఇంట్లో రక్తపు మరకల దుస్తులు!

Published Fri, Oct 16 2020 2:58 PM

Hathras Incident CBI Officers Recovered Blood Stain Clothes From Accused House - Sakshi

లక్నో : హథ్రస్‌ దళిత యువతి అత్యాచారం కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు సీబీఐ అధికారులు. గ్రామంలో తాత్కాళిక కార్యాలయం ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది వరకే బాధితురాలి కుటుంబసభ్యుల్ని పలు మార్లు విచారించారు. గురువారం నలుగురు నిందితుల కుటుంబసభ్యుల్ని అధికారులు విచారించారు. ఆధారాల కోసం వారి ఇళ్ల వద్ద సెర్చ్‌ ఆపరేషన్‌లు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తాజాగా నిందితుడు లవ్‌ కుశ్‌ సికార్వర్‌ ఇంట్లో రక్తపు మరకలతో కూడిన దుస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ‘హథ్రాస్‌ బాధితురాలిగా నా భార్య ఫోటో’ )

అయితే ఈ వార్తల్ని నిందితుడి కుటుంబసభ్యులు ఖండించారు. లవ్‌ కుశ్‌ సోదరుడు రవి ఓ ఫ్యాక్టరీలో పెయింటర్‌గా పని చేస్తున్నాడని, అందుకే అతడి బట్టలు ఎర్ర పెయింట్‌తో మాసిపోయి ఉన్నాయని చెప్పారు. అది కేవలం ఎర్ర రంగు మాత్రమేనని సీబీఐ అధికారులు భావిస్తున్నట్లుగా రక్తపు మరకలు కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు నిందితుడి సోదరుడు లలిత్‌ ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశాడు.

Advertisement
Advertisement