తల్లిదండ్రుల మధ్య గొడవ.. పురుగుల మందు తాగిన కుమార్తె.. | Girl Self Destruction In Nalgonda | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల మధ్య గొడవ.. పురుగుల మందు తాగిన కుమార్తె..

Aug 20 2021 10:41 AM | Updated on Aug 20 2021 2:07 PM

Girl Self Destruction In Nalgonda - Sakshi

సాక్షి, మద్దిరాల(నల్లగొండ): పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధి లోని జి.కొత్తపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన నిమ్మ సుధాకర్‌ మేరమ్మ దంపతులు తరచూ గొడవ పడుతున్నారు.

దీంతో వారి కుమార్తె నిమ్మ రూప(18)మనస్థాపానికి గురై బుధవారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు సూర్యాపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. తల్లి మేరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై నాగయ్య తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement