ఘోరం: యువతిని వివస్త్రను చేసి.. ప్రైవేట్ భాగాలను కాల్చి.. | Girl Assasinated Her Private Parts Burnt By Unknown Dabri Area Delhi | Sakshi
Sakshi News home page

ఘోరం: యువతిని వివస్త్రను చేసి.. ప్రైవేట్ భాగాలను కాల్చి..

Nov 16 2021 8:39 PM | Updated on Nov 16 2021 9:54 PM

Girl Assasinated Her Private Parts Burnt By Unknown Dabri Area Delhi - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. డ్రాబ్రీ పీఎస్‌ పరిధిలోని ఓ నాలాలో గుర్తు పట్టలేకుండా ఉన్న ఓ యువతి మృతదేహాన్ని  పోలీసులు గుర్తించారు. ఆమెను గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వివస్త్రను చేసి అందులో పడేశారని తెలిపారు. ఆమె వివరాలు తెలియకుండా యువతి ముఖంతో పాటు ప్రైవేటు భాగాలను కూడా కాల్చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ విషయాన్ని ధృవీకరించిన ఆ ప్రాంత డీసీపీ.. తమకి సోమవారం సాయంత్రం యువతి మృతదేహం లభ్యమైందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న క్రైమ్‌ టీమ్‌, ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించగా, పలు ఆధారాలు లభించాయన్నారు. దీంతో పాటు, చుట్టుపక్కల ఉన్న సీసీటీవి ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామన్నారు. అలానే, ఈ వయస్సు గల అమ్మాయిలు ఎవరైనా తప్పిపోయిన సమాచారాన్ని కూడా వివిధ స్టేషన్లో పోలీసులు సేకరిస్తున్నారని చెప్పారు. దీంతో పాటు మృతదేహం లభ్యమైన ప్రదేశానికి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె పై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

చదవండి: Love Couple Suicide: తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement