అమ్మతనానికే కళంకం.. పిల్లల ముందే ప్రియుడితో కలిసి వ్యభిచారం

Ghaziabad Woman Doing Prostitution with Lover CCTV Reveals - Sakshi

ఘజియాబాద్‌లో చోటు చేసుకున్న సంఘటన

సీసీటీవీ ఫుటేజ్‌తో మహిళ బండారం బట్టబయలు

లక్నో: అమ్మ ప్రేమ గురించి కవులు, పుస్తకాలు ఎంతో గొప్పగా వర్ణించారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే తల్లి ప్రేమ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. కానీ నేటి కాలంలో కొందరు మహిళలు బరితెగించి ప్రవర్తిస్తూ.. అమ్మ అనే మాటకే మాయని మచ్చగా మిగులుతున్నారు. శారీరక సుఖం కోసం కన్న బిడ్డలను బలి తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌, ఘజియాబాద్‌ కవినగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు..

కవినగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం నిందుతురాలైన మహిళతో వివాహం అయ్యింది. వారికి ఓ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు సంతానం. కొన్నేళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత సదరు వ్యక్తి భార్యకు ఓ క్యాబ్‌ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో భర్త పని కోసం ఇంటి నుంచి వెళ్లగానే.. క్యాబ్‌ డ్రైవర్‌ వారి ఇంటికి వచ్చేవాడు.
(చదవండి: నాడు యువతి చేతిలో చెంప దెబ్బలు.. నేడు రాజకీయాల్లో ప్రవేశం)

ఇక ఇంట్లో పిల్లల ముందే.. సదరు మహిళ, క్యాబ్‌ డ్రైవర్‌ విచ్చలవిడిగా ప్రవర్తించేవారు. పిల్లల ముందే వారి తల్లి.. క్యాబ్‌డ్రైవర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించేది. అంతేకాక ప్రియుడి కోరిక మేరకు అతడు చెప్పిన వారికి నగ్నంగా మారి వీడియో కాల్స్‌ చేసేది. వీరి వికృత చేష్టలు చూసి పిల్లలు తీవ్రంగా భయపడేవారు. వారి అరచకాలు అంతటితో ఆగలేదు. 

సదరు క్యాబ్‌ డ్రైవర్‌ తన ప్రియురాలి పిల్లలతో కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీని గురించి ఎవరికైనా చెబితే.. తండ్రిని చంపేస్తామని బెదిరించేవాడు. ఇలా సాగుతున్న వీరి వికృత చేష్టల గురించి ఓ సారి సదరు మహిళ భర్తకు తెలిసింది. ఇరుగుపొరుగు వారు.. అతడు బయటకు వెళ్లాక ఇంటికి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడని.. రోజు ఇలానే జరుగుతుందిన తెలిపారు. 
(చదవండి: పోలీస్‌ కస్టడీలో యువకుడు మృతి.. హత్యా? ఆత్మహత్యా?)

అప్పటికే భార్య ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి.. భార్యకు తెలియకుండా ఇంట్లో సీసీటీవీ కెమెరా అమర్చాడు. ఇక దానిలో రికార్డయిన దృశ్యాలు చూసి.. అతడికి ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. భార్య, ఆమె ప్రియుడి వికృత వేషాలు అతడి కంటపడ్డాయి. దీని గురించి భార్యను నిలదీయగా.. నా ఇష్టం.. నా దారికి అడ్డువచ్చావంటే చంపేస్తానని బెదిరించింది.

దాంతో సదరు వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఆమె ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వ్యభిచారం చేస్తుందని పేర్కొన్నాడు. తనను, పిల్లలను చంపుతామని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పోలీసులు బాధితుడి భార్య, ఆమె లవర్‌ మీద పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. 

చదవండి: భయపెట్టమంటే.. భయానికే భయం పుట్టించాడు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top